Header Banner

ఏపీలో సీ ప్లేన్‌లు వచ్చేశాయ్! ఎక్కడి నుంచి ఎక్కడివరకు అంటే!

  Wed Jun 04, 2025 10:42        Others

టూరిజంలో మరో కీలక అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటి వరకు పర్యాటకులు లాంచీ ప్రయాణాలు చేయగా, ఇకపై సీ ప్లేన్ లో నీళ్లలో నుంచి నింగిలోకి ఎగిరిపోనున్నారు. విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం జలాశయం వరకు సీప్లేన్ ట్రయల్ రన్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో భాగంగా అమరావతి నుంచి తిరుపతి, గండికోటకు సీ ప్లేన్ సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది.

 


8 పర్యాటక ప్రదేశాలకు సీ ప్లేన్ సేవలు

ఏపీలో పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం సీ ప్లేన్ సేవలను ప్రారంభించడానికి పలు ప్రాంతాలను పరిశీలించింది. ఇందులో భాగంగా 8 ప్రదేశాలను ఫైనలైజ్ చేసింది. వాటిలో అమరావతి, తిరుపతి, గండికోట, అరకు, లంబసింగి, కోనసీమ, శ్రీశైలం, రుషికొండ ఉన్నాయి. ఎంపిక చేయబడిన 8 ప్రదేశాలలో తొలి విడుతగా అమరావతి నుంచి తిరుపతి, గండికోట ప్రాంతాలను కలుపుతూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అమరావతిలోని ప్రకాశం బ్యారేజ్, తిరుపతిలోని కల్యాణి ఆనకట్ట, గండికోట రిజర్వాయర్ లో సీ ఎయిర్ పోర్టులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నవంబర్ 9, 2024న, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి శ్రీశైలం వరకు జరిగిన టెస్ట్ ఫ్లైట్లో ప్రయాణించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 


తొలి దశలో 3 ప్రాంతాల్లో సీ ప్లేన్ సర్వీసులు

సీ ప్లేస్ సర్వీసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) టెక్నో-ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించడానికి, DPRలు తయారు చేయడానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రభుత్వం ఎనిమిది ప్రదేశాలకు బిడ్లను పిలిచినప్పటికీ, మొదటి దశలో మూడు ప్రదేశాలకు DPRలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. అమరావతి, గండికోట కోసం DPR పనులను రైట్స్ దక్కించుకోగా, ఫీడ్బ్యాక్ హైవేస్కు తిరుపతి వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ పనులను కేటాయించారు.

 

ఉడాన్ పథకంలో భాగంగా సీ ప్లేన్ సర్వీసులు

కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద సీప్లేన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా 56 సీ ప్లేన్ మార్గాలను గుర్తించింది. వాటిలో 32 మార్గాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకం కాబట్టి, దశలవారీగా నీటి ఏరోడ్రోమ్లను నిర్మించడానికి 8 ప్రదేశాలను గుర్తించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఈ సీ ప్లేన్ సర్వీసులను విస్తరించేలా ఏపీ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మొదట మూడు ప్రాంతాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వీటి ద్వారా ఏపీ టూరిజాన్ని మరింత డెవలప్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #SeaplaneServices #AndhraTourism #APSeaplane #WaterToSky #FlyFromWater #APDevelopment #TourismBoost #UDANSeaplane #SeaplaneAdventure #SeaplaneTrailsIndia